SAKSHITHA NEWS

పాఠశాలలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎచ్ఎమ్ వసంత..

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం తిరుమలకుంట మండల పరిషిత్ కేంద్ర ప్రాథమికొన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా కన్నుల పండవగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ సున్నం సరస్వతి మరియు ఉపసర్పంచ్ జుజ్జురి రాంబాబు, ఎంపీటీసీ నారం నాగమణి హాజరయ్యారు. స్థానిక పాఠశాలలో హెచ్ఎం వసంతతో పాటు సర్పంచ్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.స్వతంత్ర సంగ్రామంలో జీవితాలను పణంగా పెట్టిన త్యాగధనులకు నివాళులర్పించారు.
అనంత‌రం మిఠాయీలు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు.విద్యార్థులు వేసిన వివిద వేశాధారణలు ఆలరించాయి.వివిధ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు విద్యార్థులకు నోట్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి దేశం కోసం పోరాడారని, అలాగే అనునిత్యం సైనికులు దేశరక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్ పనికుమారి, రజిని, మడకం ముత్యాల రావు, రమేష్, రాజేష్, వార్డ్ నెంబర్ కుర్సం సుధా పాల్గొన్నారు.


SAKSHITHA NEWS