SAKSHITHA NEWS

increased wages for the Nagari Powerloom workers should be implemented from August

image 3
నగరి పవర్లూమ్ కార్మికుల కు పెంచిన వేతనాలు ఆగస్టు నుండి అమలు చేయాలి

నగరి లో పవర్లూమ్ కార్మికుల సమ్మె సందర్భంగా రెవెన్యూ డివిజన్ అధికారి సమక్షంలో పవర్లూమ్ యజమానులు అంగీకరించిన వేతనాలను ఆగస్టు 1 తేది నుండి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 న చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయాలని ఈ రోజు నగరి లో జగదీష్ అధ్యక్షత న జరిగిన యూనియన్ సమావేశం నిర్ణయించింది.

సీఐటీయూ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య , తిరుపతి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు వెంకటేష్ లు మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికులు జూలై లో 15 రోజులు సమ్మె చేసినప్పుడు కలెక్టర్ జ్యోక్యం తో.నగరి ఆర్.డి.ఓ సమక్షంలో పవర్లూమ్ కార్మికనాయకులు,యజమానులు కు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆగస్టు నుండి ఒక మీటర్ కు అదనంగా రూ 2-50 ప్రకారం ఈ రోజు వరకు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరుస్తుంటే ఆర్.డి.ఓ. ఎందుకు యజమానులు పై చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయకపోతే ఈ నెల 20 న చిత్తూరు కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేస్తారని మళ్ళీ కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేసేంత వరకు కలెక్టరేట్ ఎదుట నిరవధికంగా దీక్షలు చేస్తామని వీరు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

యూనియన్ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ కోశాధికారి షణ్ముగం లు మాట్లాడుతూ పెరిగిన విద్యుత్ చార్జీలతో అష్టకష్టాలు పడుతుంటే పెంచిన వేతనాలు ను ఆగస్టు నుండి అమలు చేయక యాజమానూలు నిర్లక్ష్యంగా ఉండడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసారు. నెలకు రూ 26 వేలు కనీస వేతనం రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించాలను డిమాండ్ చేశారు.500 యూనిట్ల వారకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రస్తుతం వసూలు చేసిన అదనపు విద్యుత్ చార్జీలను తిరిగి పవర్లూమ్ కార్మికుల కు చెల్లించాలని విద్యుత్ అధికారుల వేధింపులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. పి.చైతన్య

SAKSHITHA NEWS