సాక్షిత : టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * అధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్,బాచుపల్లికి చెందిన యువకులు కమ్మెట ముఖేష్,గజేంద్ర,నవీన్,విశాల్,సంజయ్ మరియు వారి మిత్రా బృందం సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటున్నారని,అందుకే యువత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల స్పూర్తి పొందిన ఎంతోమంది యువత తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని,ఈ సారి తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సదానందం,బౌరంపేట మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,ఫిషెర్మన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పోషి మహేశ్,అశోక్ రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,ఆంజనేయులు,బత్తుల చిరంజీవి,సాయి కుమార్,సాయి,గణేశ్,రవి నాయక్,నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ లో యువత చేరిక
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…