కొంపల్లిలో ‘హెయిర్ క్రియేషన్స్‘ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘ హెయిర్ క్రియేషన్స్ ‘ క్లినిక్ 12వ బ్రాంచ్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి సన్న కవిత శ్రీశైలం యాదవ్, హెయిర్ క్రియేషన్స్ ఎండి రజనీ, ఎండి వినాయక్, డాక్టర్లు సింధు, దీప్తి, నాయకుడు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page