శ్రీకాళహస్తి పట్నంలో అర్బన్ హెల్త్ సెంటర్లు ఇదివరకు భాస్కరపేట మరియు గజేంద్రనగర్ లకే పరిమితం అయింది , బ్రిడ్జ్ యువతల ఉన్న 8 వార్డులకు మరియు చుట్టూ ఉన్న 15 గ్రామాలకు అత్యధిక సౌకర్యాలతో అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
శ్రీకాళహస్తి పట్టణం, మండల ఎంపీడీవో కార్యాలయం వెనకాల అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 30 ఏళ్ల రాజకీయం చేసిన గోపాలకృష్ణారెడ్డి కుటుంబం పేరుతో ఏర్పాటైన విశాలాక్షి నగర్ మరియు బృందమ్మ కాలనీలోని నిరుపేదలకు కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ హెల్త్ కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగిందని రాజకీయాల అతీతంగా ప్రజల ఆరోగ్యమే ప్రాముఖ్యంగా ఏర్పాటు చేశామని తెలిపారు..గత పాలకులు చేయలేనిది ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఉద్దేశంతో నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,బుజ్జి రెడ్డి, మధు రెడ్డి,ఆర్కాడ్ ముత్తు,కిట్టు మేస్త్రి,ఆర్కాడు హేమంత్ ,కార్తీక్,శ్రీరాములు గౌడ్, వయ్యాల కృష్ణారెడ్డి, కంట ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.