SAKSHITHA NEWS

తిరుపతిలో అందరికి తాగునీరు – కమిషనర్ అనుపమ అంజలి

సాక్షిత, తిరుపతి బ్యూరో: మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని అందరికి నీరు అందించేలా తగు చర్యలు చేపట్టినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. తిరుపతి నగరంలో అమృత్ స్కీమ్ క్రింద మహిళా యూనివర్సిటీ వద్ద నిర్మించిన వాటర్ ట్యాంక్ పనితీరును పరిశీలిస్తూ అమృత్ స్కీమ్ క్రింద నగరంలో 15 లక్షల కెపాసిటి కల్గిన 16 వాటర్ ట్యాంక్లను నిర్మించడం జరిగిందన్నారు. నగరంలోని ప్రతి డివిజన్లో అవసరమైన అన్ని గృహాలకు నీటి సరఫరాను అందించే లక్ష్యంతో అమృత్ స్కీమ్ క్రింద నిర్మించిన వాటర్ ట్యాంక్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ట్యాంక్ నుండి గృహాలకు వెళ్ళే పైపు లైన్ పనితీరుపై కూడా సిబ్బంది పర్యవేక్షణ వుండేలా ఇంజనీరింగ్ అధికారులు శ్రద్ద తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీచేసారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ మహేష్ వున్నారు.


SAKSHITHA NEWS