కార్యకర్తల సంక్షేమంపై శిష్ట్లా లోహిత్ చేస్తున్న ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు

Spread the love

కార్యకర్తల సంక్షేమంపై శిష్ట్లా లోహిత్ చేస్తున్న ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు

కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం లక్ష్యమని గర్వంగా చెబుతున్నా*

  • చంద్రబాబు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి
  • కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్
  • చంద్రబాబు సమక్షంలో కార్యకర్తలకు అవగాహన
  • ప్రసంగాన్ని వేదికపై నుండి ఆసక్తిగా విన్న చంద్రబాబు

-సాక్షిత కుప్పం, చిత్తూరు జిల్లా, : కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా దేశంలో పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని గర్వంగా చెబుతున్నానని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో కలిసి శిష్ట్లా లోహిత్ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం కుప్పం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించాలని శిష్ట్లా లోహిత్ కు చంద్రబాబు సూచించారు. కార్యకర్తల హర్షధ్వానాల నడుమ శిష్ట్లా లోహిత్ ప్రసంగం సాగింది. చంద్రబాబును తన అభిమాన నాయకుడిగా, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా శిష్ట్లా లోహిత్ అభివర్ణించారు. కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కార్యకర్తలు కష్టాల్లో ఉన్నపుడు వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు, నారా లోకేష్ లు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. దీనిలో భాగంగా ఆరోగ్యం, ఉపాధికి సంబంధించి ర్యాపిడో, న్యూట్రిఫుల్ యాప్ లను రూపొందించడం జరిగిందన్నారు. కార్యకర్తలు ఆరోగ్యంగా ఉంటేనే తెలుగుదేశం పార్టీ పటిష్ఠంగా ఉంటుందని చంద్రబాబు, లోకేష్ లు అభిప్రాయపడ్డారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో న్యూట్రిఫుల్ యాప్ అందుబాటులోకి వచ్చిందని, ఈ యాప్ ద్వారా డయాబెటిస్, బరువు, థైరాయిడ్ వంటి సమస్యలకు ప్రముఖ వైద్యులచే సలహాలను అందిస్తున్నామన్నారు. సరైన డైట్ ప్లాన్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కార్యకర్తల ఉపాధికి సంబంధించి రూపొందించిన ర్యాపిడో యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. దీనిద్వారా కార్యకర్తలు రోజుకు రూ. 2 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తూ మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ఇప్పటి వరకు రూ.100 కోట్ల ఆర్ధికసాయాన్ని అందించారని తెలిపారు. గతంలో కన్నా ఎక్కువగా యువతను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఇందు కోసం క్యాడర్ వెల్ఫేర్ 2.0 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆసుపత్రుల్లో తక్కువ ధరలకే నాణ్యమైన వైద్యం అందేలా టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని శిష్ట్లా లోహిత్ చెప్పారు. కార్యకర్తల సంక్షేమంపై శిష్ట్లా లోహిత్ చేస్తున్న ప్రసంగాన్ని వేదిక పైనే ఉన్న చంద్రబాబు ఎంతో ఆసక్తిగా వింటుండడం కన్పించింది.

Related Posts

You cannot copy content of this page