In the International Karate Tournament held in Hyderabad
హైదరాబాదులో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్లో జమ్మికుంట మరియు వీణవంక మండలానికి చెందిన బుర్తుడు ఎండి ఆహాద్ క్రీడాకారులు పలు పతకాలు సాధించారు
హైదరాబాదులోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెకండ్ ఇంటర్నేషనల్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్ 2023 నిర్వహించారు ఇందులో జమ్మికుంట డ్రాగన్ స్కూల్ ఆఫ్ కరాటే క్రీడాకారులు చీఫ్ ఇన్స్ట్రక్టర్ సుంకరి యాదయ్య ఆధ్వర్యంలో పాల్గొన్నారు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ టోర్నీలో శ్రీలంక బాంగ్లాదేశ్ నేపాల్ తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల కు చెందిన 1000 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు
ఈ పోటీలలో జమ్మికుంటకు చెందిన దాట్ల ఆదిత్య చందుపట్ల అభిరామ్ కటాస్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు దేమే అనిక్ రాం గుప్తా కటాస్ ,స్పారింగ్ లో సిల్వర్ మెడల్ సాధించాడు కటాస్ విభాగంలో వీణవంక మండలానికి చెందిన బుర్తుడు ఎండి అహద్, అనే అబ్బాయి మరియు సిల్వర్ మెడల్ పల్ల విక్రాంత్, సంపంగి వైష్ణవి, అరె వర్షిత్, లు కాంస్య పతకాలు సాధించారు అంతర్జాతీయ కరాటే మాస్టర్లు వీరికి బహుమతులు ప్రధానం చేశారు జమ్మికుంట కరాటే క్రీడాకారులు ప్రతిభ చూపి పతకాలు సాధించడం పట్ల జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటితోపాటు పలువురు నాయకులు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.