124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లో నాలా ప్రక్కన ఉన్న గల్లీలో రోడ్డు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ స్వయంగా వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డును త్వరలోనే మంజూరు చేయించి నిర్మాణ పనులు ప్రారంభించేలా చూస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. అలాగే వాతావరణ శాఖ వారు చెప్పిన ప్రకారం ఇంకో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, పిడుగులు కూడా పడుతున్న నేపథ్యంలో ప్రజలందరు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలని సూచించారు. కాచి చల్లార్చిన నీళ్లు, తాజా ఆహారం తీసుకుంటూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, భాస్కర్ సైమాన్ రెడ్డి, పోశెట్టిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నాలా ప్రక్కన ఉన్న గల్లీలో రోడ్డు లేక స్థానికులు ఇబ్బందులు
Related Posts
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
SAKSHITHA NEWS దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహ దిమ్మె కూల్చివేతపై టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం… ఎల్. బి నగర్ : కామినేని చౌరస్తా వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహ దిమ్మెని అభివృద్ధి పేరిట…
128 చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కాలనీలో, హజ్రత్ జిందాషా మాదర్ దర్గా
SAKSHITHA NEWS 128 చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కాలనీలో, హజ్రత్ జిందాషా మాదర్ దర్గా కమిటీ వారు నిర్వహిస్తున్న హజరత్ జిందాషా మాదర్ రహమతుల్లా ఆలే ఉర్సు ఉత్సవాలలో భాగంగా, గాంధీనగర్లో మొహమ్మద్ రియాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సందల్ ముబారక్…