దిల్లీ మున్సిపల్ ఎన్నికలు లో…ట్రాన్స్ జెండర్ విజయం

Spread the love

In Delhi municipal elections…transgender victory

దిల్లీ మున్సిపల్ ఎన్నికలు లో…ట్రాన్స్ జెండర్ విజయం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో తొలిసారి ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి విజయం సాధించారు. బుధవారం వెలువడుతున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో సుల్తాన్‌పురి-ఎ వార్డు నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్‌ బాబీ కిన్నార్‌ గెలిచారు.

సామాజిక కార్యకర్త అయిన 38 ఏళ్ల బాబీ.. అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. 2017లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ బాబీకి టికెట్‌ ఇచ్చింది. దిల్లీలో ఓ టాన్స్‌జెండర్‌ అభ్యర్థికి ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడం ఇదే తొలిసారి.

స్పష్టమైన మెజార్టీ దిశగా ఆప్‌..

కాగా.. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. మొదట్లో ఆప్‌, భాజపా మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నప్పటికీ.. ఇప్పుడు కేజ్రీవాల్‌ పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఆప్‌ 86 వార్డుల్లో విజయం సాధించి.. మరో 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.

ఇక, భాజపా 70 చోట్ల గెలచి.. మరో 36 వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ కేవలం 4 స్థానాల్లో విజయం సాధించి.. మరో 6 చోట్ల ముందంజలో ఉంది. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 250 వార్డులుండగా.. మెజార్టీకి 126 స్థానాలు అవసరం. ఈ ఎన్నికల్లో ఆప్‌ గెలుపు దాదాపు ఖరారవడంతో ఆమ్‌ ఆద్మీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Related Posts

You cannot copy content of this page