నీట్ పీజీ 2023 పరీక్ష మరియు వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

Spread the love

నీట్ పీజీ 2023 పరీక్ష మరియు వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

-పోలీస్ కమిషనర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

నీట్ పీజీ 2023 పరీక్ష మరియు వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజనీర్, ఎం పి ఎల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ మరియు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం వ్రాత పరీక్ష (ఓఎంఆర్ బేస్డ్) పరీక్షల నేపథ్యంలో అయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, మినిస్ట్రీ హెల్త్ &
ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్, అర్బన్ డివిజన్ పరిధిలోని మొత్తం 14 సెంటర్లలోమొత్తం 6049 మంది మరియు నీట్ పేజీ 2023 పరీక్ష 2 సెంటర్లలో 315 అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజనీర్, ఎం పి ఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరు, అవుతారని పోలీస్ కమిషనర్ విష్ణు తెలిపారు. అదేవిధంగా నిర్వహిస్తున్న పరీక్షాల కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఈ ఆంక్షలు అమలుల్లో వున్నందున ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 5:00 వరకు పరిక్ష కేంద్రాల సమీపంలో 500 అడుగుల లోపు ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరిక్ష సమయంలో సమీపంలో జిరాక్స్ సెంటర్లు ముసివేయాలని సూచించారు. ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page