చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి_కలిశెట్టి

Spread the love

చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి_కలిశెట్టి

ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడం మండలం
15-09-2023

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పై సిఐడి పోలీసులు బనాయించిన అక్రమ కేసులను సత్వరమే ఎతివేయాలని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్,ఎచెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు గారు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం ఎచెర్ల నియోజకవర్గం పరిధి జి.సిగడాం మండలం సర్వేశ్వరపురం గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసును నమోదు చేయడాన్ని ఖండిస్తూ కలిశెట్టి అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో జి సిగడాం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తొలుత రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని కలిశెట్టి అప్పలనాయుడు గారు ఆరంభించారు.ఈ సందర్భంగా అప్పలనాయుడు గారు మాట్లాడుతూ అక్రమంగా అరెస్ట్ చేసిన నారా చంద్రబాబునాయుడు గారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నారా చంద్రబాబునాయుడు గారి పై బనాయించిన కేసును కూడా సత్వరమే ఎత్తివేయాలని కోరారు. ఈ దీక్ష శిబిరంలో
జి.సిగడాం మాజీ ఎంపీపీ
బాలబొమ్మ వెంకటేశ్వరరావు గారు,పొన్నం సర్పంచ్ సుంకర అప్పన్న గారు,డి.ఆర్.వలస మాజీ సర్పంచ్ కూమరాపు అప్పన్న గారు,బాతువ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి డబ్బాడ ఆదినారాయణ , ముసిని వలస మాజీ సర్పంచ్ గుణుపూర్ త్రినాధ్ గారు, వెంకటేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,బల్లెడ వెంకటరావు,కెల్ల కృష్ణ, మొండేటి చిరంజీవి,శ్రీను, పాలిసెట్టి జగనాదం, శ్రీను( ఆనందపురం)లతో పాటుభారీ ఎత్తున కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page