ఎంపీజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

Spread the love

మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం ఆధ్వర్యంలో స్థానిక అజీజ్ గల్లీ లోని, జెఐహెచ్ కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముఖ్య అతిదులుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ లు, విశిష్ట అతిథులుగా ఎంపీజే సుప్రీం కౌన్సిల్ కన్వీనర్
ఎం.డి. సాదిక్ అహ్మద్,
ఖమ్మం పౌర సమితి అధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమమును ఉద్దేశించి తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ
రంజాన్ మాసం అతి పవిత్రమైనదని, పేదలను జకాత్ పద్ధతిలో ఆదుకోవడం తనకు ఎంతో నచ్చిన అంశమని పేర్కొన్నారు. సాదిక్ అహ్మద్ మాట్లాడుతూ ఇటువంటి ఇఫ్తార్ విందులతో మత సామరస్యం వెల్లి విరుస్తుందని, అన్నారు. మహమ్మద్ జావేద్, డా. పులిపాటి ప్రసాద్ లు మాట్లాడుతూ నెల రోజులపాటు ముస్లిం సోదరులు నిర్వహించే ఉపవాస దీక్షలు సమాజ హితానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లా ఎంపీజే అధ్యక్షులు షేక్. ఖాసిం మాట్లాడుతూ రంజాన్ అంటే పవిత్ర ఖురాన్ అవతరించిన మాసమని, అందుకు కృతజ్ఞతగా ప్రపంచంలోని ముస్లింలందరూ కఠినమైన ఉపవాస దీక్షను పాటిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమములో మాజీ సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ అశ్రిఫ్, బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్రు నాయక్, ఎంపీజే సభ్యులు ఆశ్రీన్, అజీజ్, గఫార్, రఫీక్, పాషా, జిలాని, కొదమూరు భద్రయ్య, వెంకన్న, శ్రీనివాస్, రమేష్, వేణు, హుస్సేన్ మియా, నాగుల్ మీరా, గౌస్, రహమాన్, ఎంపిజే మీడియా కన్వీనర్ టి.ఎస్. చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page