న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు
-ఎస్సై నాగుల్ మీరా
ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగుల్ మీరా అన్నారు. పోలీస్ ఖమ్మం కమిషనరేట్ ఉత్తర్వుల ప్రకారంగా రహదారులు, బహిరంగ ప్రదేశాలలో గుర్తుతెలియని వ్యక్తులపై, వాహనాలపై రంగులు చల్లకూడదని ఓ ప్రకటనలో తెలియజేశారు. గ్రామాలలో ప్రధాన కూడళ్లలో మైకులు, డీజేలు, సౌండ్ బాక్సులు పెట్టి ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించరాదని, డీజే లకు మైకులకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. బైకులపై ర్యాలీలు మరియు గుంపులు గుంపులుగా ఉండటం చేయరాదు ఎటువంటి న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చింతకాని ఎస్సై హెచ్చరించారు.