SAKSHITHA NEWS

If artificial shortage of seeds and fertilizers is created, action will be taken

వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలి.

విత్తన దుకాణాల ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక.

:- మండలంలో ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని సూర్యాపేట అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక సూచించారు. శుక్రవారం మోతె మండలం రాఘవాపురం వద్ద గల శ్రీరామ ఫెర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దుకాణాల్లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు విక్రయాలు జరగాలని నకిలీ విత్తనాల అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలకు రసీదులు తప్పక ఇవ్వాలని అలాగే సూచిక బోర్డ్ లో నిల్వల వివరాలు ఉంచాలని తెలిపారు. రైతులు ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నకిలీ ఎరువులు, విత్తనాలపై గట్టి నిఘా ఉంచామని దళారుల వద్ద రైతులు మోసపోకుండా వ్యవసాయ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.

  • తదుపరి తుమ్మల పల్లి, మోతె మండల కేంద్రంలో గల పాఠశాలలో అమ్మ ఆదర్శ పనులను పరిశీలించారు.
  • ఈ కార్యక్రమంలో డి. ఈ. ఓ అశోక్, mpo హరిసింగ్, మోతె సబ్ ఇన్స్పెక్టర్ యాదవేంద్ర రెడ్డి, ఏ.ఓ అరుణ, ఆర్.ఐ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

If artificial shortage of seeds and fertilizers is created, action will be taken

SAKSHITHA NEWS