తిరుపతిని ఇంత అభివృద్ధి చేసిన నాయకుడిగా నాకు ఓటు

Spread the love

తిరుపతిని ఇంత అభివృద్ధి చేసిన నాయకుడిగా నాకు ఓటు వేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .

శశి స్కూల్ ఉపాధ్యాయులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

నేను డిప్యూటీ మేయర్‌గా ఈ రెండున్నర సంత్సరాల్లో చేసిన అభివృద్ధి చూసి గర్వపడుతున్నాను, భూమన కుటుంబం వారసుడిగా కాకుండా నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నాను, తిరుపతి డెవలెప్‌ కోసం ఇన్ని పనులు చేశానని సగర్వంగా చెప్పగలను.

మన తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తూ పోతుంటారు, దీంతో నగరవాసులు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్నారు, ఇది చూసిన నేను ముందుగా నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని నిశ్చయించుకున్నాను.

ఇందులో భాగంగా నూతనంగా18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7 ఫ్రీ లెఫ్ట్‌లు, 5 స్లిప్ వేలు నిర్మించాం. దీంతో ప్రజలు ట్రాఫిక్ నరకం నుంచి బయటపడ్డారు. ఇదే కాకుండా తిరుపతిని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాను.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నా తిరుపతి.. మన తిరుపతిని ఇంత అభివృద్ధి చేసిన నాయకుడిగా నాకు ఓటు వేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను

Related Posts

You cannot copy content of this page