రోడ్డు ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు- హైడ్రా కమిషనర్ రంగనాథ్
మిర్జాలగూడ లో స్వయంగా రోడ్డు ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
సదరు అక్రమ నిర్మాణదారులకు హెచ్చరించిన రంగనాథ్
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే జైలుకు వెళ్లడం ఖాయమని అధికారులకు ఆదేశం
రోడ్డు ఆక్రమణలకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల మిర్జాలగూడ చిన్మయ మార్గం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథన్ కలిసి తమ కాలనీలో కూడా లేఔట్ 66 ఫీట్లు రోడ్డు ఉంటే 30 ఫీట్ల రోడ్డు అనుమతులతో అక్రమ నిర్మాణాలు చేపట్టాలని దానివల్ల వర్షం పడిన ప్రతిసారి నరకయాతన అనుభవిస్తున్నామని ఇండ్లలో వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన కమిషనర్ రంగనాథ్ బుధవారం మిర్యాలగూడ లోని అక్రమంగా నిర్మించిన ఐదు ఇండ్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన సదరు నిర్మాణదారులను స్వయంగా మీరే కూల్చి వేసుకోవాలని లేదంటే నోటీసులు జారీ చేసి బుల్డోజర్ల సహకారంతో హైదరాబాద్లో కూల్చివేతలు ప్రారంభిస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే సహించేది లేదని మల్కాజ్గిరి సర్కిల్ 28 అధికారులను మరియు పట్టణ ప్రణాళిక అధికారులను ఆయన స్వయంగా హెచ్చరించారు అలాగే త్వరలో మిర్జాలు కూడా నాలా ఇరువైపులా అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలలో నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపడతామని తెలిపారు ఈ ఈ కార్యక్రమంలో గిరిజాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు