SAKSHITHA NEWS

హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ అలలపై  దేశంలోనే తొలిసారిగా లేజర్‌ ఆధారిత సౌండ్‌ అండ్‌ లైట్‌ షో అందుబాటులోకి వస్తోంది. ఈ నెల 12 సాయంత్రం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఈ లైట్‌ అండ్‌ సౌండ్‌ షోలో ‘కోహినూర్‌’ వజ్రం చరిత్ర ఉంటుంది.   కథను రాజ్యసభ ఎంపీ, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ పర్యవేక్షణలో.. రచయిత ఎస్‌.ఎస్‌.కంచి రాశారు. నేపథ్య గాయని సునీత గాత్రాన్ని, వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతాన్ని అందించారు.  800 నుంచి 1000 మంది కూర్చునేలా సంజీవయ్య పార్కులో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, దేశ స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను ప్రదర్శిస్తారు.

● రోబోటిక్‌ నాజిల్స్‌, లైటింగ్‌:

వెయ్యికి పైగా రొబోటిక్‌ నాజిల్స్‌, డీఎంఎక్స్‌ ప్రొటోకాల్‌తో కూడిన అడ్వాన్స్‌డ్‌ అండర్‌ వాటర్‌ లూటంగ్‌ సిస్టమ్‌ ద్వారా మరింత అందాన్నిచ్చేలా తీర్చిదిద్దారు. ఆకర్షణీయ లేజర్‌ రంగుల కోసం మూడు 40డబ్ల్యూ ఆర్‌జీబీ లేజర్స్‌ను ఏర్పాటుచేశారు. పనోరమిక్‌ వ్యూ కోసం రూఫ్‌ టాప్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుచేశారు. 260 అడుగుల ఎత్తు, 540/130 డైమెన్షన్‌తో దేశంలోనే.. అతిపెద్ద, అతి ఎత్తయిన రికార్డ్‌-బ్రేకింగ్‌ వాటర్‌ ఫౌంటేయిన్‌ను వినియోగిస్తున్నారు.

WhatsApp Image 2024 03 12 at 1.42.04 PM

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP


SAKSHITHA NEWS