SAKSHITHA NEWS

తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్లు
నందమూరి గారికి -భారతరత్న- ఇవ్వాలి
పట్టణ తెలుగుదేశం పార్టీ

చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా టవర్ క్లాక్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహమునకు మాలలు వేసి పుష్పాలను చల్లి నివాళులర్పించారు
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా పేరుగాంచిన, పేద ప్రజలకు తినేదానికి పట్టెడన్నం ఉండేందుకు ఇల్లు కట్టుకునేందుకు గుడ్డలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే కాక దేశములోనే ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న ప్రజా నాయకుడు ఎన్టీఆర్ అని, పేద ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యము, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మండలాల ఏర్పాటు, ప్రజల వద్దకే పరిపాలన, కార్మికులకు కర్షకులకు ఉపాధి కల్పన, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్ అని పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు జిల్లా టిఎన్టియుసి అధికార ప్రతి నిధి జ్యోతి నాయుడు ఆయన సేవలను కొనియాడారు
రాష్ట్ర ప్రజలు అల్లకల్లోల పరిస్థితిలో ,రాష్ట్ర ప్రజానీకం ఢిల్లీ పెద్దల అజమాయిషి లో ఉండగా సిని పరిశ్రమ నుండి nకోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవమును కాపాడేందుకు పోరాడి విజయం సాధించిన మహానుపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు, ఇలాంటి ఉత్తమ ప్రజా సేవకుల ఆత్మబంధువునకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి. రాష్ట్ర టిఎన్టియుసి కార్యదర్శి బాలాజీ .సీనియర్ నాయకులు గుణశేఖర్. బిపిఆర్ముఖం. అల్లిముత్తు. సెంథిల్ కుమార్ రజనీకాంత్ జి శేఖర్ .రాజ్యలక్ష్మి ప్రతాప్. మహేంద్ర బాబు .సురేషు. ఆకుల అశోకు. కె పురం అశోక్. సంపత్త .అనంతప్ప నాయుడు. కిషోర్ .పలని. మొదలగున వారు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS