రంగారెడ్డి జిల్లా పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఇవ్వాల బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.
నేతాజీనగర్లోని ఏషియన్ బ్యారల్స్ డ్రమ్ముల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. కంపెనీలో అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో పొగలు దట్టంగా అలుముకు న్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదం కారణంగా స్థానికులు తీవ్ర భయాందో ళనకు గురయ్యారు.