124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో నివసించే దండంపల్లి రామస్వామి కి షుగర్ వ్యాధి కారణంగా ఇటీవల సర్జరీ చేసి కాలు తీసివేయడం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న రామస్వామికి హోప్ ఆఫ్ హంగర్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ వారి సహకారంతో డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి చేతులమీదుగా వీల్ చైర్ మరియు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. కార్పొరేటర్ గారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి తమ డివిజన్ లోని పేద ప్రజలకు సేవ చేస్తున్న హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్యకు మరియు వారి బృందానికి కృతజ్ఞతలు తెలియచేసారు. రానున్న రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని సంస్థ వారిని కోరారు. కార్యక్రమంలో మరేళ్ల శ్రీనివాస్, భిక్షపతి, మధులత, మీరయ్య, నరసింహులు, మల్లీశ్వరి, వెంకటేశ్వరరావు, రవి కిరణ్, అమూల్య, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
నడవలేని స్థితిలో ఉన్న రామస్వామికి హోప్ ఆఫ్ హంగర్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ
Related Posts
ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు
SAKSHITHA NEWS ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు మల్లన్న గిదేంది.. సర్వే నెంబర్ 166,167, సూరారం కుత్బుల్లాపూర్ మండలంలో CMR స్కూల్ ఆవరణంలో ప్రభుత్వ భూమి 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి…
కరెంట్ షాక్ తో సంఘటన స్థలంలోనే మృతి చెందిన వ్యక్తి
SAKSHITHA NEWS కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి kvr లే అవుట్ కాలని లో నిర్మిస్తున్న కమాన్(దర్వాజ) వల్ల ఓ కార్మికుడికి విద్యుతాఘాదం. కరెంట్ షాక్ తో సంఘటన స్థలంలోనే మృతి చెందిన వ్యక్తి. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని…