SAKSHITHA NEWS

హైదరాబాద్:
సైబర్‌ నేరాలను అరికట్టాలని హోంమంత్రి మహమూద్‌ అలీ పోలీసు అధికారులకు సూచించారు. డీజీపీ, మూడు కమిషనరేట్ల సీపీలతో హోంమంత్రి మహమూద్‌ అలీ బుధవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.

సాంకేతిక వినియోగం, నేరాల నియంత్రణపై చర్చించారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా అభినందించారు. మరింత కృషి చేస్తూ నేరాలను అరికట్టాలని సూచించారు.

సీసీఐటీవీ కెమెరాల ఏర్పాటు, నిఘాలో దేశంలోనే అగ్రస్థానంలోనే ఉన్నామన్నారు. కాలనీ, బస్తీలు, కూడళ్లలో మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని, కొత్త ఠాణాలు, జోన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సైబర్‌ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అరికట్టాలని, సైబర్‌ నేరాలపై అవగాహన పెంచాలని సూచించారు……..


SAKSHITHA NEWS