విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత…

Spread the love

సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా డివిజన్ పరిధిలోని అల్లాపూర్ తెలుగు మీడియం, కొత్తూరు సీతయ్య నగర్ ప్రభుత్వ పాఠశాల, పండిత్ నెహ్రు నగర్ ఉర్దూ మీడియం మరియు రామారావు నగర్ ప్రభుత్వ పాఠశాలలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావితరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని తెలంగాణ ప్రభుత్వ ఆశయం-ఆలోచన అని విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టి పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూల్ లు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత స్కూల్ యూనిఫామ్, ఇలా చాలా విధాలుగా విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని. అలాగే కార్పొరేటర్ పిల్లలకు అక్షరాభ్యాసం చేపించి నూతనంగా లైబ్రరీలను ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీర రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, జ్ఞానేశ్వర్, అబ్దుల్ హమీద్, సలావుద్దీన్, అస్లాం, సలీం, అబ్దుల్ రజాక్, శివ, చాంద్ సాబ్, యోగి రాజు, తులసి, మల్లేష్, రాంబాబు, బాలరాజు, సాంబ, రాజు, పార్వతమ్మ, పర్వీన్ సుల్తానా, గీత, తాజ్ బి, సునీత, శమా, రేణుక, ప్రతిభ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page