కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కు హైకోర్టు చురక

Spread the love

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు కలేక్టర్ ఉత్తర్వులను రద్దు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కమిటీ సభ్యుడిగా విధులు నిర్వహిస్తున్న యండి. సాదిక్ పాషా పై ఇటివలే కొన్ని తప్పుడు అభియోగాలతో యఫ్ఐఆర్ నమోదు అయింది.

అనంతరం జిల్లా సంక్షేమ అధికారి(డి.డబ్ల్యు.ఓ)తప్పుడు నివేదిక మేరకు జిల్లా కలెక్టర్ సాదిక్ పాషా ను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడిగా విధులకు హాజరు కాకుండ నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, కలేక్టర్ కు ఇలా ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని, కలేక్టర్ ఉత్తర్వులు భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 14, 16 ను కాలరాస్తున్నయని, ఇట్టి ఉత్తర్వులను రద్దు చేసి, తనను విధులు కోసాగించే ఉత్తర్వులు జారీ చేయలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో సినియర్ న్యాయవాది మాదిరాజు శ్రీనివాస రాజు తో సాదిక్ పాషా రీట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హై కోర్టు కలేక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తు, సాదిక్ పాషా ను యథావిధిగా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడిగా విధులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిందని సాదిక్ పాషా న్యాయవాది సంకుబాపన అనుదీప్ తెలిపారు

Related Posts

You cannot copy content of this page