SAKSHITHA NEWS


Herbs increase mental happiness and physical well-being

క్రీడాలు మానసిక ఉల్లాసాన్ని,శారీరక దారుడ్యాన్ని పెంపొందుతాయి


సాక్షిత ప్రతినిధి.
క్రీడాలు మానసిక ఉల్లాసాన్ని శారీరక దారుడ్యాన్ని పెంపోందిస్తాయని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ ఆదేశానుసరం ఎగ్జిక్యూటివ్ మెంబెర్ వరప్రసాద్ రెడ్డి అన్నారు.గత 5రోజుల నుంచి నడుస్తున్న ఐక్యత ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న విఠయిపల్లి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో గెలుపొందిన విన్నర్ టీం పోచమ్మ తండా కు మొదటి బహుమతి 20వేయిలు, షీల్డ్, రన్నర్ టీం రెండవ బహుమతి 15వేయిలు చంద్రయనపల్లి చిన్న తండాకు ఆయన అందజేశారు.

ఈ సందర్బంగా వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉపాధి తో పాటు క్రిడాకారులుగా ఎదగడం కోసం తమవంతు సహకారం అందిస్తానాని తెలిపారు.ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించి మాలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి మీరు చేస్తున్న కృషి మాకు చాలా ఉపయోగకరంగా ఉందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సుజాత రాములు,మాజీ సర్పంచ్ పర్వతాలు,నితిన్ రెడ్డి వెంకట్ రెడ్డి శ్రీనివాస్ మరియు క్రీడాకారులు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS