SAKSHITHA NEWS

Help line set up for rain relief – Commissioner Anupama Anjali

వర్షం సహాయచర్యలకు హెల్ప్ లైన్ ఏర్పాటు – కమిషనర్ అనుపమ అంజలి


సాక్షిత : తిరుపతి మునిసిపల్ పరిధిలోని ప్రజలు రానున్న వర్షాల వలన ఎలాంటి ఇబ్బందులు వున్నా వెంటనే తమ హెల్ప్ లైన్ నంబర్ 0877-2256766 కు పోన్ చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. రానున్న వర్షాలను దృష్టిలో వుంచుకొని ముందస్తు చర్యలపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డితో జరిగిన వీసి సమావేశంలో పాల్గొన్న తరువాత

మునిసిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశమైన కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ అధిక వర్షాలు కారణంగ లోతట్టు ప్రాంతాలు, పెద్ద కాలువలు వద్ద పర్యవేక్షణ చేయాలని, ఓకవేళ ఎక్కడన్నా కాలువల నిర్వహణపై సందేహం వుంటె సంబందిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

వర్షంలో ఎలాంటి సహాయం కావాలన్నా తమ సిబ్బంది నిరంతరం అందుబాటులో వుంటారని ప్రజలనుద్దేశించి కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. కాలువలు ఏవైన మరమ్మత్తులు చేయాలంటె వెంటనే చేయాలని సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్ కు, శానిటేషన్, వైధ్యం అందుబాటులో వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణకు, హెల్ప్ లైన్ వద్ద నిరంతరం విదుల్లో వుండేలా సిబ్బందిని ఏర్పాటుచేయాలని మేనేజర్ చిట్టిబాబుకు కమిషనర్ అనుపమ అంజలి ప్రత్యేక ఆదేశాలు జారి చేసారు.*


SAKSHITHA NEWS