గుండె నిండా జాతీయతను చాటాలి; 75 సంవత్సరాల వజ్రోత్సవ మహా ర్యాలీ ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే లావుడియ రాములు నాయక్

SAKSHITHA NEWS

గుండె నిండా జాతీయతను చాటాలి; 75 సంవత్సరాల వజ్రోత్సవ మహా ర్యాలీ ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే లావుడియ రాములు నాయక్
సాక్షిత : వైరా పట్టణంలో వైరా శాసనసభ్యులు రాములు నాయక్ సహకారంతో, వైరా మున్సిపల్ శాఖ వారు ,,వైరా పోలీస్ శాఖ వారు, లయన్స్ క్లబ్ వారు ,ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం, మత్యశాఖ, మిషన్ భగీరథ, మెప్మా, వైరా పట్టణం మరియు రూరల్ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల అందరి సంయుక్త సహకారంతో స్వతంత్ర భారతావని 75 సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ వైరా పట్టణంలో మధిర రింగురోడ్ సెంటర్లోని ఇండోర్ స్టేడియం నుంచి మహా ర్యాలీని వైరా శాసనసభ్యులు లవుడియ రాములు నాయక్ జండా ఊపి ప్రారంభించారు .ఈ యొక్క మహా ర్యాలీని ఇండోర్ స్టేడియం నుంచి పాత బస్టాండ్ సెంటర్ మీదుగా పెట్రోల్ బంక్ వరకు అక్కడ నుంచి మరల మధిర రింగురోడ్ సెంటర్ చేరుకొని , 75 నెంబర్ వచ్చే విధంగా వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు అన్ని రకాల డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రజలు ఆ యొక్క 75 ఆకారంలో నిలుచొని తమ యొక్క దేశభక్తిని చాటుకోవటం జరిగింది .ఈ సందర్భంగా ప్రియతమా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది త్యాగఫలాలతో ,ఎంతో మంది మహానుభావుల జీవిత బలిదానాలతో ఆనాటి 200 సంవత్సరాల పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి ఎదురు నిలబడి సాధించుకున్న ఈ స్వతంత్ర భారత సామ్రాజ్యoలో ఈరోజు మనం ఆ త్యాగ ఫలాలను అనుభవిస్తున్నామని, అటువంటి త్యాగాలతో ఈనాడు మనం నిలబడి ఈ భారత వనిని కాపాడుకోవాలని, ఆనాటి దేశభక్తిని పెంపొందించుకొని రాబోయే రోజులలో భారతదేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని, విశ్వ జ్ఞాన కేంద్రంగా ఈ భారతదేశం నిలబడాలని అందుకు ప్రతి ఒక్కళ్ళు తమ తమ వంతుగా కృషి చేయాలని కొనియాడారు . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశానాలతో ఈనెల 8 నుంచి 22 వరకు వజ్రోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నామని అందరూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైరా ఏసిపి రెహమాన్ , రాష్ట్ర మార్క్పెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ ,వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు ,మార్కెట్ చైర్మన్ బీడికే రత్నం ,ఎంపీపీ వేల్పులు పావని, జడ్పిటిసి నంబూరు కనకదుర్గ ,వైరా కమిషనర్ వెంకటపతిరాజు ,లైన్స్ క్లబ్ గవర్నర్ కాపా మురళీకృష్ణ ,ఎంఈఓ వెంకటేశ్వరరావు, వైరా పట్టణ మరియు రూరల్ అధ్యక్షులు దార్ణ రాజశేఖర్ ,బాణాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర దాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంబూరు మధుసూదన్ రావు, వైరా సీఐ సురేష్, ఎస్ ఐ వీరప్రసాద్ ,రైతు సమన్వయ సమితి కన్వీనర్ మిట్టపల్లి నాగేశ్వరరావు, మిషన్ భగీరథ అధ్యక్షులు మద్దిల రవి, మత్స్య శాఖ అధ్యక్షులు ఎస్కే రహీం ,అఖిలపక్ష నాయకులు వీరభద్రం ,చలపతి గోపాలరావు , పట్టణ నాయకులు మోటపోతుల సురేష్ ,అప్పం సురేష్ ,డాక్టర్ కోటయ్య ,వనమ విశ్వేశ్వరరావు , వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, ప్రజలు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page