ఆరోగ్య తెలంగాణే లక్ష్యం…కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

Spread the love

శేరిలింగంపల్లి డివిజన్ లోగల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం యందు అదనపు కొత్త భవనం..మెరుగైన సౌకర్యాలను స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తో కలిసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా కాంట్రాక్టర్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ని, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని శాలువా కప్పి పూలబొకే ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన అదనపు భవనం శిలాఫలకాలాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యందు రహేజా గ్రూప్, సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.42 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు భవనము ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు సేవలను మెరుగుపరచడంలో ఆసుపత్రి నిబద్ధతలో ఈ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. అదనపు భవనం కు ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి కృషి, సహకారం ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ సీఎం కెసిఆర్ ప్రజారోగ్యం మీద దృష్టి సారించి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలందించేందుకు పూనుకున్నారని అన్నారు. కొత్తగా ప్రారంభించబడిన భవనం ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంటుందని పేర్కొన్నారు.

ప్రజారోగ్య సేవలను మెరుగుపరచడంలో గత ప్రభుత్వ అంకితభావాన్ని ప్రతిబింబిస్తూ, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడంలో, వైద్య నిపుణులకు మద్దతు ఇవ్వడంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, రాజేశ్వరమ్మా, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డ్ మెంబర్ రాంబాబు, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, రాంచందర్, శ్రీనివాస్ యాదవ్, జనార్దన్ రెడ్డి (కాంట్రాక్టర్), కేఎన్ రాములు, గోపాల్ యాదవ్, పద్మారావు, రమేష్, బసవయ్య, కోదండరాం, వెంకట్ రెడ్డి, సత్తర్, నయీమ్, రహీం, అహ్మద్, పున్నారావు, నరసింహ, జమ్మయ్య, మహేష్ చారీ, విజయానంద్, వహీద్, వెంకటేశ్వర్లు, మహేందర్ సింగ్, సుమన్, సత్యనారాయణ సింగ్, విజయ్ కుమార్, నటరాజ్, సురేష్, కుటుంబ రావు, రాజు, దస్తగిర్, శ్రీనివాస్, ఉపేందర్, పెంటయ్య, విజయ్, మహిళా నాయకురాళ్లు ముంతాజ్ బేగం, భాగ్యలక్ష్మి, జయ, సుజాత, శశికళ, దివ్య, నిరూప, సబియా, గౌసియా, కుమారి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page