మహారాష్ట్ర :
పూణె లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారి తన భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బానర్ ప్రాంతంలో తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అమరావతి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తుస్తున్న భరత్ గైక్వాడ్ బానర్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న గైక్వాడ్ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తన తుపాకీతో భార్య మోని గైక్వాడ్ (44) ను కాల్చి చంపాడు.
కాల్పుల శబ్దం రావడంతో పక్క గదిలో నిద్రిస్తున్న గైక్వాడ్ కుమారుడు, మేనల్లుడు పరుగున అక్కడికి వచ్చారు. తలుపు తెరిచిన మేనల్లుడు దీపక్ (35) పై గైక్వాడ్ గన్నుతో కాల్చాడు. దీంతో అతడి ఛాతీపై బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం గైక్వాడ్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఏసీపీ మొదట తన భార్య తలపై కాల్పులు జరిపాడు. తుపాకీ కాల్పుల శబ్దం విన్న అతడి కుమారుడు, మేనల్లుడు పరుగున వచ్చి తలుపు తెరిచారు. దీంతో మేనల్లుడుపై గన్నుతో ఛాతీపై కాల్చాడు. ఆ తర్వాత గైక్వాడ్ తన తలపై కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు…