SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

స్త్రీ అంటే మూర్తీభవించిన సహనం, స్త్రీ అంటే ప్రేమకు ప్రతీక, స్త్రీ అంటే త్యాగానికి ప్రతిరూపం, స్త్రీ అంటే ప్రపంచం, స్రీ అంటే విశ్వం, స్త్రీ అంటే సర్వం, స్త్రీ లేనిది జగమే లేదు. స్త్రీ లేనిది జీవితమే లేదు, స్త్రీ లేనిది మనిషేలేడు. ఓ గురువుకు, ఓ వైద్యుడికి, ఒక ఇంజనీరుకు, సమాజంలో మార్పు తెచ్చే నాయకుడికి జన్మనిచ్చేది స్త్రీ అటువంటి స్త్రీలపై ఆక్రందనలు, అవేదనలు, అత్యాచారాలు హింస, దౌర్జన్యాలకు గురికాకుండా ఉన్నా జానెడు జాగా లేదు. ప్రతి క్షణం కొన్ని వేల ప్రాణాలు ఏదో ఒక హింసకు గరై కాల గర్భంలో కలసిపోతున్నాయి ఇది ప్రతి రోజూ జరిగే వ్యవహరమే. ఈ వార్తలకు మనం అలవాటు పడి పోయాము. రోజులు ఎవరి కోసం ఆగవు. జరిగే నేరాలూ ఆగవు. అదుపు చేసేవారే లేకపోతే ఎలా ఆగుతాయి గాయాలు ఉన్నా ఎన్ని బాధలు అనుభవించినా అన్నింటిని విస్మరించి మళ్ళీ వేడుకలు జరుపుకుంటునే ఉంటాము.మొదటగా 1911 లో దీన్ని ఆంతర్జాతీయ ఉద్యోగ మహిళా దినోత్సంవంగా జరుపుకోగా 1914 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పరిగణించడం జరిగింది.మానవ ప్రపంచంలో పురుషులకు సమభాగమైన స్త్రీ స్థానాన్ని ఆదరించడంలో యావత్ ప్రపంచం ఘోరంగా విఫలమైంది. ఒకనాడు స్త్రీని నిర్ధాక్షిణ్యంగా అణిచివేయడం జరిగితే నేడు ఆమెను విచ్చలవిడిగా వ్యవహరించే పరిస్థితులకు వదిలివేయడం జరిగింది. ఇవి రెండు కూడా అతివాదాలే. ఈ గందరగోళాల మధ్య స్త్రీ జాతి తీవ్రమైన నష్టానికి లోనయింది. వారి హక్కులు సరిసమానమే కాని బాధ్యతలు మాత్రమే వేరు అని గ్రహించాలి


అదునికతకు అలవాటుపడిన స్త్రీలు నేడు కుటుంబం అనే వ్వవస్థను గుదిబండగా, తమ ప్రగతికి అవరోధంగా చూస్తున్నారు. ఏ బాదరబందీ లేని ప్రకృతి విరుద్ధమైన సంభంధాలపై మొగ్గుచూపుతున్నారు. స్త్రీని అర్ధికంగా అభివృద్దధి పధంవైపు నడిపిస్తామని అభివృద్ధి పేరట కొందరిని విశ్వసుందరిగా, అందాల బామలుగా చూపిస్తూ దైవం మానవ జాతికి ప్రసాదించిన స్త్రీ ఆనే సంపదను ప్రదర్శనకు పెట్టి వ్యాపారం సాగిస్తున్నారు. సమాజంలో స్త్రీపురుష సమానత్వం సాకుతో, స్వేచ్ఛ పేరట స్త్రీలు ఎంతగా మోస పోతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. లివింగ్ రిలేషన్ యువతులను ఎంతటి దుర్భరస్థితుల్లోకి నెట్టేస్తుందో మనం చూస్తున్నాము. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో తేల్చుకోలేని సంస్కతిని చూసి చంకలు గుద్దుకుంటున్నాము లివింగ్ రిలేషన్ ముదిరి గే సంస్కృతి వచ్చింది. ఆడాళ్ళు ఆడళ్లతో, మగాళ్లు మగాళ్లతో లైంగిక వాంచ తీర్చుకోవడం కూడా చట్టబద్ధతైకూర్చుంది గడ్డం గీసుకునే బ్లేడు మొదలు బాడి స్ప్రే దాక ప్రచారం కోసం అడవాళ్లను అర్ధ నగ్నంగా చూపించి సోమ్ము చేసుకుంటున్నారు. ఎ ప్రకటన చూసిన ప్రచర చిత్రం చూసిన ఆడాళ్ల అస్తిత్వాన్ని దెబ్బతీసేలానే ఉన్నాయి స్వేచ్ఛ పేరుతు రెచ్చగొట్టే దుస్తులు , ప్వాషన్ షోలు, యువతీ , యువకులు విచ్చలవిడి కలియిక వల్ల కలిగే అనర్ధాలు ఇప్పుడు మనం చవిచూస్తన్నాము. ఆదునికతకు గుర్తింపుగా భావిస్తు విధ్యార్థి దశ నుండే కళాశాలల్లో దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ రంగంలో ఉన్న మహిళలు చెడు అలవాట్లకు బానిసై
అనుకున్న రంగంలో రాణించలేక ఆత్మహత్యలే పరిష్కారంగా జీవితాలకు ముగింపు పలుకుతున్నారు ఈ మహిళా దినోత్సవం స్త్రీల సామాజిక సమస్యలపై ఉద్యమించాలి.

పెరుగుతున్న అశ్లీలతను నియంత్రించేందుకు. దాన్ని ప్రోత్సహించే సాధనాలకు కూడా అభివృద్ధి చెందనీయకుండా ఆపివేయాలి స్త్రీల రక్షణ కోసం ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పరుస్తున్నామని చెప్పి తమ బాధ్యత అక్కడితో అయిపోయిందనే అధికారులు ధోరణి సరయినది కాదు. రక్షణ చట్టాలను సరిచేయవలసిన బాధ్యత కూడా ఎంతో ఉందని మరువరాదు.
స్త్రీలను అశ్లీలంగా చూపించేవారికి వ్వతిరేకంగా నినాదాలు. అవసరమైతే ఉద్యమాలు చేయాలి. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అంటే సరిపోదు మనలోనే చైతన్యం రావాలి. ఒక నిర్భయ, ఇంకో ఆసిఫా, మరో దీశ, అయేషా ఇలా మరెందరో స్త్రీలు బలి కాకుండా మనమే కాపాడుకోవాలి. స్త్రీ తన అందచందాలను ప్రదర్శించకుండా తన సంప్రదాయాల్ని నైతిక విలువలు, కట్టుబాట్లకు విలువనిస్తు తన వల్ల తన కుటుంబానికి, సమాజానికి, తన లాంటి మరో స్త్రీకి అన్యాయం కలగ కుండా ఉన్నరోజే నిజమైన ఉమన్స్ డే

WhatsApp Image 2024 03 07 at 6.23.18 PM

SAKSHITHA NEWS