Happy Samata Sainik Dal Foundation Day
ఘనంగా సమతా సైనిక్ దళ్ ఆవిర్భావ దినోత్సవం
బాబా సాహెబ్ డా.బి.ఆర్ అంబేద్కర్ తేదీ 24.9.1924 లో స్వయంగా వ్యవస్తీకరించిన సమతా సైనిక్ దళ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక ఆదివారంపేట వద్ద గల డా బి ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవన ప్రాంగణంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎం.జె.బాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అంతకు ముందు డా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వక్తలు మాట్లాడుతూ సమతా సైనిక్ దళ్ 1924 సెప్టెంబర్ 24 న ఇండియన్ ఆర్మీ మహార్ రెజిమెంట్ లో పదవీ విరమణ చేసిన సైనికులు అందరితో కలిసి అంబేద్కర్ గారు ఏర్పాటు చేసారని,అప్పటి నుండి సమతా సైనిక్ దళ్ అంబేద్కర్ కు రక్షణ కవచంలా నిలిచిందని తెలిపారు.అందులో 1929 మార్చి 20 న జరిగిన మహాద్ చెరువు పోరాటం గొప్పదని అలా ఎన్నో పోరాటాలు చేస్తూ పీడిత జాతిపై జరుగుతున్న అత్యాచారాలు,దౌర్జన్యాలు పై అండగా నిలిచి ముందుండి పోరాటాలు జరిపింది.
సమతా సైనిక్ దళ్ సభ్యులు సుశిక్షితులై క్రమశిక్షణ కలిగి బడుగు బలహీన వర్గాలకు రక్షణగా నిలవాలని ఉద్భోదించారు.బాబా సాహెబ్ గారు సిద్ధాంతాలు ఆశయాలను అనుసరిస్తూ తాడిత పీడిత,బడుగు బలహీన వర్గాలకు వారికి అండగా నిలవాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో అలికాన మహేష్ కుమార్,పందిరి లోకేష్,పురుషోత్తం రాంబాబు,కొంచడా సూర్యనారాయణ,బడియా నాగేశ్వరరావు,పిస అదవ్ కుమార్,నేతల అప్పారావు, బేరి వసంత కుమార్,అక్కేన రాజారావు,తదితర సమతా సైనిక్ దళ్ సభ్యులు పాల్గొన్నారు…