SAKSHITHA NEWS

ఘనంగాఎంపీ నామ పుట్టిన రోజు వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట లోని వృద్ధ ఆశ్రమం అమ్మ సేవాసనంలో మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ నామ నాగేశ్వర రావు జన్మదిన సందర్భంగా అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం మండల నాయకులు. టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ నెంబర్ బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వృద్ధులకు బట్టలు పంపిణీ చేసి భోజనాల ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికి ఎటువంటి సమస్య ఉందని తెలియజేసిన స్పందించే వ్యక్తి నామ నాగేశ్వరరావు అని నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమందికి సేవలందించారని వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మందపాటి మోహన్ రెడ్డి యూఎస్ ప్రకాశరావు సర్పంచ్ నారం.రాజశేఖర్, తిరుమల కుంట ఉపసర్పంచ్ రాంబాబు చిప్పనపల్లి శ్రీను. శెట్టిపల్లి.రఘురామ్,డేరంగుల.శ్రీను, డేరంగుల చంటి గడ్డం చిట్టిబాబు రామినేని సురేష్ సేవాసదనం నిర్వాహకురాలు కూరపాటి అనసూయ ,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS