పెందుర్తి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఏపీ గిడ్డంగుల శాఖ మాజీ డైరెక్టర్ గుంటూరు వెంకట నరసింహారావు పెందుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 6 గంటల సమయంలో జూనియర్ కాలేజీ ఆవరణలో వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. స్థానికుడునైన తనకు ఇక్కడ సమస్యలన్నీ తెలుసునని వాటిని పరిష్కారించే శక్తి సామర్థ్యాలు తనకే ఉన్నాయని వారికి వివరించారు. పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వాకర్స్ క్లబ్ సభ్యులు శేఖర్, చంద్రశేఖర్, అన్నపూర్ణ శేఖర్, అవగడ్డ నాయుడు, కృష్ణ తదితరులు ఉన్నారు.
వాకర్స్ అసోసియేషన్ లో గుంటూరు ఎన్నికల ప్రచారం.
Related Posts
విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !
SAKSHITHA NEWS విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ కార్యకలాపాలు సీఎం చంద్రబాబు తో గూగుల్ ప్రతినిధుల భేటీ గూగుల్ తో ఎంఓయూ చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం SAKSHITHA NEWS