గుడ్ ఫ్రైడే రోజు ఏసుక్రీస్తు పరలోక ప్రాప్తి చెంది ఆ మరుసటి రోజు ప్రభువు పునురుస్థానం చెందారని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ తెలిపారు. సూర్యాపేట సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యాక్రమం ఘనంగా నిర్వహించారు. శనివారం చర్చ్ కాంపౌండ్ వద్ద ప్రారంభమై కొత్త బస్ స్టాండ్ వద్ద ర్యాలీ ముగిసింది. అనంతరం నిర్వహించిన కార్యాక్రమంలో పాస్టర్లు మాట్లాడుతూ మానవాళి పాప విమోచననికి యేసు క్రీస్తు తన ప్రాణాలను శిలువలో అర్పించిన రోజున గుడ్ ఫ్రైడేగా, తిరిగి మూడో రోజు ఆదివారం సమాదిలో నుండి లేచిన రోజున ఈస్టర్ గా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా చైర్మన్ మామిడి శ్యామ్సన్,జిల్లా ఎలక్షన్ చైర్మన్ జాకబ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావు,పట్టణ సలహాదారుడు జోహార్ పాల్, పట్టణ అధ్యక్షుడు జలగం డేవిడ్ రాజ్,మత్తయి, సెంటినరీ బాప్టిస్ట్ చర్చి సంఘ పెద్దలు, కార్యవర్గ సభ్యులు, విశ్వాసులు, తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో ఘనంగా రన్ ఫర్ జీసస్
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS