SAKSHITHA NEWS

Great honor to Chinta Prabhakar.

చింత ప్రభాకర్ కు ఘనంగా సన్మానం. హైదరాబాదులోని నారాయణగూడ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ భవనంలో చైర్మన్ గా చేనేత మంత్రి కేటీఆర్ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి .

ఎమ్మెల్సీ రమణ సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన చింత ప్రభాకర్ కి ఘనంగా సన్మానం చేసి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ముదిగొండ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక చేనేత కార్మికుల వలసలు పోవుడు ఆకలి చావులు ఆత్మహత్యలు తగ్గాయని చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే 2016 పెన్షన్ నులు సబ్సిడీ చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేనేత కార్మికులకు జీవిత బీమా తదితర కార్యక్రమాలు చేపట్టి చేనేత కార్మికులకు చేతనందిస్తుందని తెరాస ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు

చేనేత కార్మికులకు సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ద్వారా చేనేత కార్మికులకు రుణాలు చేనేత సంఘలు బలోపేతం కొరకు క్యాష్ క్రెడిట్ రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ బూర మల్లేశం సిద్దిపేట చేనేత సహకార పారిశ్రామిక సంఘం మాజీ కార్యదర్శి ముదిగొండ శ్రీనివాస్ పద్మశాలి సంఘం కార్యదర్శి చేర్యాల మల్లికార్జున్ సిరిగది బాలరాజ్ చేర్యాల వెంకన్న సంగు పురేందర్ చేనేత సంఘం మేనేజర్ ముదిగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS