SAKSHITHA NEWS

మిర్యాల గ్రామ SC లకు స్మశాన స్తలాన్ని కేటాయించాలి డా గోదా జాన్ పాల్ మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్


పల్నాడు జిల్లా కారంపూడి మండలం మిర్యాల గ్రామంలో సంవత్సరాల తరబడి స్మశానం భూమి లేక ఒక మనిషి చనిపోతే పాతి పెట్టటానికి స్మశాన స్థలాన్ని కేటాయించాలని పలుమార్లు మండల తహసిల్దారుని ప్రజాప్రతినిధులను రెండుసార్లుగా జిల్లా కలెక్టర్ ని కలిసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదని మరో మారు అనగా ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ లోతేటి శివశంకర్ గారిని స్పందన ద్వారా కలసి మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గోదా జాన్ పాల్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న నేటికీ ఈ సమాజంలో ఒక పేదవాడు ఉండటానికి ఇల్లు లేదని తినటానికి సరైన తిండి లేదని ఒక మనిషి చచ్చిపోతే అయిదు అడుగులు స్థలం కావాలని నేటికీ కోరుతున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం దుర్మార్గమైన సంఘటనలు మరొకటి లేవంటూ ఆయా గ్రామాలలో ప్రభుత్వ స్థలాలు కొంతమంది భూకబ్జాదారుల చేతుల్లో ఉంటే వాటిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ వారి మీద ఉన్నప్పటికీ వారు పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం ఇటువంటి భూములు వారి చేతుల్లో నుండి విడిపించి స్మశానాలు లేని గ్రామాలకు రెవిన్యూ అధికారులు ఇప్పించటం లో విఫలమయ్యారని నేటికైనా మిర్యాల గ్రామ SC లకు స్మశానOనకు స్థలం కేటాయించాలని లేని పక్షం లో మండల స్థాయి నుండి జిల్లా వ్యాప్త ఉద్యమానికి పిలుపు నిస్తామని హెచ్చరించారు ..కలెక్టర్ గారిని కలసిన వారిలో గంటేనపల్లి లక్ష్మి,చప్పిడి లక్ష్మి,పెద్ద పార్వతి, మేరీ రాణి,దార్ల ఈశ్వరమ్మ ,రమణ,సుగుణమ్మ,చిన్న అమ్మాయి,వెంకటరత్నం తదితరులు వున్నారు


SAKSHITHA NEWS