ఘనంగా సమైక్య రజక సంఘ అపార్ట్మెంట్ వచ్మెన్ మహాసభ

Spread the love


Grandly Samaikya Rajaka Sangha Apartment Vachmen Mahasabha

ఘనంగా సమైక్య రజక సంఘ అపార్ట్మెంట్ వచ్మెన్ మహాసభ
అపార్ట్మెంట్ వచ్మెన్లకు జీతాలు పెంచాలి : మాజీ కౌన్సిలర్ జక్కుల లక్ష్మయ్య
సమైక్య రజక సంఘ సభలో ముదిరాజు, గంగ పుత్ర, నాయిబ్రాహ్మణ సంఘాల నేతలకు ఘన సన్మానం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఆదివారం నాడు ఖమ్మం నగరంలోని అపార్ట్మెంట్ల వాచ్మెన్ సోదరులకు అపార్ట్మెంట్ యజమాన్యాలు తక్కువ వేతనం ఇస్తున్నారని వారి జీతాలను పెంచాలని మాజీ కౌన్సిలర్, డీసిఎంఎస్ డైరెక్టర్ జక్కుల లక్ష్మయ్య కోరారు. ఆదివారం స్థానీక బురహాన్ పురం లో జరిగిన నగర అపార్ట్మెంట్ వాచ్మెన్ ల సంఘం మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ లకు రెండు గదులు విశాలంగా నిర్మించి ఇచ్చేలా యాజమాన్యాలు కృషి చేయాలని ఆయన అన్నారు.

వాచ్మెన్ లకు పనిభద్రత కల్పించాలని అయన కోరారు. తొలుత ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభించి ధర్నా చౌక్ వద్ద కు చేరుకుని చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి బస్ డిపో రోడ్డు మహాసభ ప్రాంగనంకు చేరుకుని తొలుత జ్యోతి ప్రజ్వాలన చేసి మహాసభ ప్రారంభించారు.

ఈ సందర్బంగా ముదిరాజు సంఘం జిల్లా నాయకులు 45 డివిజన్ కార్పొరేటర్ బుడిగం శ్రీనివాసరావు, 46వ డివిజన్ కార్పొరేటర్ మరియు గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు కన్నం ప్రసన్న, పెద్దపల్లి సోమయ్య, నాయి బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షులు నంద్యాల నరసింహారావు, హరి, లను ఘనంగా శాలువా లతో సత్కరించారు.

అనంతరం అపార్ట్మెంట్ వాచ్మెన్ ల సంఘం నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో సమైక్య రజక సంఘం నాయకులు జక్కుల వెంకటరమణ, నగర కన్వీనర్ కణతాల నరసింహారావు, నాయకులు తెనాలి వీరబాబు, పంతంగి రవికుమార్,తంగేళ్లపల్లి శ్రీనివాస్, చట్టు మంగ, కొత్తపల్లి పుష్ప, వట్టికోట దర్గయ్య, కొలిపాక వెంకట్, గొట్టేపర్తి శ్రీనివాస్, కొండపల్లి రాంబాబు, సట్టు సత్యనారాయణ,

మిట్టపల్లి శంకర్, బాతరాజు కనకయ్య,రేగుముడి రామకృష్ణ,నల్లగంటి భద్రయ్య, సట్టు శ్రీనివాసరావు, రేగళ్ల హరీష్, గడ్డం రాము, లింగంపల్లి సైదులు,మాచర్ల యాలాద్రి, వట్టికోట అప్పారావు,తెనాలి నరసింహా రావు, రేగుముడి హరీష్, నేరెళ్ల ఉపేందర్, నేరెళ్ల దర్గయ్య, మణిగ కోటయ్య, పగిడిపల్లి సంపత్, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, పగిడిపల్లి సురేష్, సట్టు కళావతి, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page