ఘనంగా శివరాత్రి వేడుకలు…ఆలయాల్లో మార్మోగిన శివనామస్మరణ

Spread the love

Grand Shivratri celebrations…Shivnamasmarana in the temples

ఘనంగా శివరాత్రి వేడుకలు…ఆలయాల్లో మార్మోగిన శివనామస్మరణ…

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం ఆరెంగిపేట కొండపై వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర , ఆలయంలో అయ్యప్ప,విజయదుర్గ నవగ్రహ,ధ్వజస్థంబం గణపతి,నవగ్రహ ఆలయంలో శివ నామస్మరణతో మార్మోగింది..ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఆది దేవుడిని పూజించారు..

తెల్లవారు జామునుండే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించుకున్నారు.ఆలియా ప్రధాన ప్రధాన అర్చకులు నాగేశ్వర్ శర్మ అధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు,రుద్రాభిషేకాలు నిర్వహించారు..భక్తులు తరలిరావడంతో దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లు ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు.ప్రత్యేక దర్శన సదుపాయాన్ని దేవస్థానం వారు కల్పించారు.భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page