SAKSHITHA NEWS

Govt for the specially abled person

దివ్యాoగులకు ప్రభుత్వం అండ

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

దివ్యాoగులకు నామ శుభాకాంక్షలు
టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

దివ్యాoగులకు వైకల్యం శాపం కాదు…మానసిక స్టైర్యం కల్పించడం ద్వారా వారి జీవితాల్లో చిరు దివ్వెలు వెలిగించాలని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ నామ దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయి కి ఎదగాలని నామ ఆకాక్షించారు.
దివ్యాంగులకు ప్రత్యేక విద్యను అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇలా అవకాశమున్న ప్రతీచోట వారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని, సాధికారతను పెంచే దిశగా అవసరమైన అన్ని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నదని వెల్లడించారు. రాబోయే కాలంలో దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నదని పేర్కొన్నారు. దివ్యాంగులను మనలో ఒకరుగా ఆదరిస్తూ వారి సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా నామ పిలుపునిచ్చారు .

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ దివ్యాoగులు ఆత్మస్థైర్యంతో తలెత్తుకొని బతికేలా వారి సంక్షేమానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులకు రూ. 500 పెన్షన్ తో సరిపడితే, స్వరాష్ట్రంలో ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉంటే అంతమందికి రూ. 3016 పింఛన్ అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నారని చెప్పారు. ప్రతి నెలా 5 లక్షల మంది దివ్యాoగులకు రూ.3016 చొప్పున ఆసరా పింఛన్ లను అందజేస్తుందని, ఇది రికార్డ్ అన్నారు.ఇందుకోసం ఏడాదికి రూ.1800.96 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో ముందుకు సాగాలని నామ అన్నారు.

ఆత్మ స్టైర్యం, ఆత్మ విశ్వాసం తో అభివృద్ధి చెందాలని నామ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి కేంద్రం ఆవార్డులు అందించిన విషయాన్ని నామ గుర్తు చేసుకున్నారు. దివ్యాంగుల (వికలాంగుల) శాఖను ప్రత్యేక శాఖగా స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ ది అన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితబంధు పథకాలతో పాటు ఇతర పథకాల్లో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగ నియామకాలలో 4 శాతం రిజర్వేషను అమలుచేస్తున్నామని నామ అన్నారు.
పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న దివ్యాంగుల కోసం ఉచిత కోచింగ్ తోపాటు మెటీరియల్, ఉద్యోగ సర్వీసుల్లో ప్రత్యేక అలవెన్సులు, ఎకనామిక్ రిహాబిలిటేషన్ సెంటర్లు, దివ్యాంగుల సలహా మండలి, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వెబ్ సైట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నామ తెలిపారు. వీల్చైర్లు, త్రీ వీలర్ స్కూటీలు, చేతికర్రలు తదితర వాటిని సమకూరుస్తూ రోజువారి జీవితంలో వారు ఎదుర్కొనే ప్రతిబంధకాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని. నామ అన్నారు.


SAKSHITHA NEWS