కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ చంద్రగిరి నగర్ కు చెందిన ఎస్.రాజు కుమార్తె శరణ్య అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక సమస్యలున్నాయని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని అశ్రాయించారు. స్పందించిన ఎమ్మెల్సీ గారు కేసీఆర్ ప్రభుత్వం తరపున రూ.2.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎల్ఓసీ మంజూరు చేయించి ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ అర్హులైన పేదలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకు తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, కుత్బుల్లాపూర్ సర్కిల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు ధర్మారెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, వెంకటేష్ పటేల్, బెంబడి నరేందర్ రెడ్డి, రామడుగు సిద్దయ్య, శివ, తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…