సాక్షిత :తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్, దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ల ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతు దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద తో కలిసి రైతులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు మిద్దెల బాల్ రెడ్డి, గరిష నరేందర్ రాజు, అధికారులు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.*
తెలంగాణ రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…