SAKSHITHA NEWS

జగనన్న పాలనకు మచ్చుతునక విద్యాకానుక
శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
మైలవరంలో జగనన్న విద్యాకానుక కిట్స్ అందజేత


సాక్షితఎన్టీఆర్ జిల్లా, మైలవరం : సర్కారు బడి పిల్లలు అన్ని అంశాల్లోను కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో సమానంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు.

మైలవరంలోని ప్రభుత్వ బాలికల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక పథకం కింద శాసనసభ్యులు కృష్ణప్రసాదు విద్యార్థినీ, విద్యార్థులకు మంగళవారం కిట్లను అందజేశారు.

అనంతరం శాసనసభ్యులు కృష్ణప్రసాదు ప్రసంగిస్తూ ప్రభుత్వ బడికి వచ్చే పిల్లలకు జగనన్న విద్యాకానుక కింద ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్‌ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన ఒక్కొక్కరికి సుమారు రూ.2500 విలువైన కిట్లను అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదల పిల్లల పట్ల ఉన్న నిబద్ధతకు, జగనన్న పాలనకు మచ్చుతునక విద్యాకానుక అని అన్నారు.

నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్ల పంపిణీని సీఎం జగనన్న పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో ప్రారంభించారని వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS