SAKSHITHA NEWS

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి.

-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్ : Madar Saheb Khammam:

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం పురస్కరించుకుని పెనుబల్లి మండలం చింతగూడెం మండల పరిషత్ పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులు పూర్తయిన సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి పునఃప్రారంభం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన ఊరు- మన బడి కార్యక్రమంతో పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాల కల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థిపై 50 వేలకు పైగా ఖర్చు పెట్టి, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి దఫాలో అధిక నమోదులు గల 50 శాతం పాఠశాలలు ఎంపికచేసి రూ. 150 కోట్లతో బ్రహ్మాoడంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. బడి ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం లు విద్యార్థులకు అందినట్లు ఆయన తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు సరళంగా అర్థం కావాలని ఒకవైపు తెలుగు, ఒకవైపు ఆంగ్లంలో ప్రైవేటు కన్నా మంచి పుస్తకాలు నిష్ణాతులచే రూపొందించినట్లు ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రెగ్యులర్ గా బడులకు పంపాలని, పిల్లల చదువుపై ద్రడ్5పెట్టాలని అన్నారు. పౌష్టికాహారం కోసం వారంలో 3 రోజులు రాగి జావ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వం విద్యార్థులపై ఇంత పెద్దఎత్తున ఖర్చుచేసి, విద్యార్థులు మంచి విద్యను పొంది, ఇది మంచి భావి భారత పౌరులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, గ్రామానికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి, అదేవిధంగా దేశానికే తలమానికంగా తయారయ్యేలా పిల్లలపై ప్రభుత్వం పెట్టుబడి అని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా చర్య5తీసుకుంటున్నదని అన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి, పాఠశాలలను ప్రయివేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నదని అన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అన్ని సౌకర్యాలతో ప్రయివేటు ను మించి మంచి వాతావరణం కలిగి ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, పీఆర్ ఇఇ చంద్రమౌళి, ఎంఇఓ వెంకటేశ్వరరావు, పెనుబల్లి ఎంపిపి లక్కినేని ఆలేఖ్య, చింతగూడెం గ్రామ సర్పంచ్ నాగదాసు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS