SAKSHITHA NEWS

బేడ బుడగ జంగాలకు ప్రభుత్వ పధకాలని వర్తింపచేయాలి – నూనె వెంకట్ స్వామి

చిట్యాల సాక్షిత ప్రతినిధి

తెలంగాణ సంస్కృతిలో ప్రధానమైన బుర్రకథలు, యక్షగానాలు, తోలుబొమ్మ లాటలు, జంగందేవరల వేషాలకు ప్రతీక అయి వీరుల చరిత్రలన్నింటినీ అద్భుతంగా చెప్పగలిగిన నేర్పరితనం ఉన్న బేడ బుడగ జంగాల వృత్తి క్షీణించిపోయి దుర్భరమైన జీవితాన్ని సాగిస్తున్నారు. దళితులలో అంతర్భాగమైన వీరికి డబుల్ బెడ్రూంలుగానీ, దళితబంధు దరిచేరడం లేదని” ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు. చిట్యాల లోని పిఆర్పీ ఎస్ ఆఫీస్ లో జరిగిన బేడ బుడగ జంగాల మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ స్వంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ౩ నుండి 5 లక్షలకు పెంచి ఇవ్వాలి. గ్రామాల్లో బంజరు పొరంబోకు భూములను ఇండ్లు, సేధ్య, స్మశాన వాటికలకు కేటాయించాలని, పాత ఇనుము స్టోరేజీ చోట్ల డెంగ్యూకు గురౌతున్నందున స్థోరేజీ పాయింట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చెయ్యాలన్నారు. కళ్ళెం రామచంద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పర్వతం శ్రీనివాస్, సిరిశాల స్వామి, చల్లా రమేష్, కూరపాటి అనిల్, కళ్ళెం రవీందర్, పర్వతం లింగస్వామి, సిరిశాల స్వామి పాల్గొన్నారు.


SAKSHITHA NEWS