SAKSHITHA NEWS

మేడ్చల్ జిల్లా రూరల్ బాచుపల్లి మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, రాజీవ్ గృహకల్ప కాలనీ సమీపంలో ప్రభుత్వ హౌసింగ్ బోర్డ్ ప్రభుత్వ స్థలం సర్వే నెంబరు 186 లో దాదాపు రెండు ఎకరా ప్రభుత్వ భూమిలో స్థానిక నాయకుల సహకారంతో రాజీవ్ గృహకల్ప లో ఉన్నటువంటి కొంతమంది రెచ్చిపోయి భూ మాఫియా గా ఏర్పడి కమిటీలు వేసుకొని దాదాపు 150 ప్లాట్లు ఒకరు ఒకరికి 80 గజాలు, 120 గజాలు ఎవరికి తోచిన విధంగా వారు ప్రభుత్వ 58, 59 రెగ్యులేషన్ చేసుకోవడానికి గత వారం పది రోజుల్లో నుండి జెసిబిలు హిటాచీలు పెట్టి చదును చేయడం జరిగింది. ఆదివారం రాత్రి ఆంజనేయస్వామి శివాలయానికి వెళ్లే కరెంటు స్ట్రీట్ లైట్లు తీసివేసి రాత్రికి రాత్రే రూములు కట్టడానికి మెటీరియల్ సిమెంట్, బస్తాలు, గనేటు ,ఇసుక ఏర్పాట్లు చేసుకొన నిర్మించడానికి పురమాయించుకోవడం జరిగింది.

కాలనీవాసుల యూత్ సహకారంతో మరియు బజరంగ్దళ్ ,విశ్వహిందూ పరిషత్,ఆటో యూనియన్ అందరి సహకారంతో అడ్డుకోవడం నిరసన ఏర్పాటు చేయడం జరిగింది. రాజీవ్ గృకల్ప కాలనీ ప్రజలు దాదాపు 12 వేల జనాభా ఉన్నవారికి కనీసం ఒక 100 గజాల పార్కు గాని ,ఒక కమ్యూనిటీ హాల్ గాని ,అంగన్వాడి కేంద్రం గానీ, కేటాయించకపోవడం ఉన్న కొద్దిపాటి ప్లేస్ స్థలాన్ని కూడా కబ్జా కి ప్రయత్నించడం జరుగుతుంది. గృహకల్ప అందరి సహకారంతో కాలనీలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇటువంటి స్థలాన్ని కేటాయించాలని ఆలయ ప్రాంగణంలో ముందు ఉన్న స్థలాన్ని అటు ఆలయానికి ఇటు కాలనీవాసులు అందరికీ ఉపయోగపడే విధముగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకోవడం జరుగుతుంది.
ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు , అధికారులు చొరవ తీసుకొని భూ ఆక్రమణకు పాల్పడినటువంటి వ్యక్తులని వారి పైన కేసు పెట్టాలని భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా రూరల్ నాయకులు రామచంద్రనాయక్ డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం కమిటీ సభ్యులు, బజరంగ్దళ్ కమిటీ సభ్యులు విశ్వహిందూ పరిషత్, కాలనీ యూత్ ఆటో యూనియన్ పాల్గొనడం జరిగింది..


SAKSHITHA NEWS