దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తత్రయ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా వీధులలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గుడ్ మార్నింగ్ అల్విన్ కాలనీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. దత్తత్రయ కాలనీలో సీసీ రోడ్లు మంజూరై ఉన్నాయని, అతిత్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తారని అన్నారు. అలాగే కనకదుర్గమ్మ గుడి వీధిలో మంచి నీటి పైప్ లైన్ కు జుంక్షన్ కలపాలి అని దీనివలన ఇరవై కుటుంబాలకు ఇప్పటివరకు చుట్టూ తెరిగివస్తున్న త్రాగునీరు డైరెక్టుగా వచ్చి ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి జుంక్షన్ కలిపే విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. వర్షంలో కూడా పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నందుకు కాలనీ ప్రజలు రామకృష్ణ గౌడ్ ను అభినందించారు. కార్యక్రమంలో మాజీ డివిజన్ అధ్యక్షులు పాండుగౌడ్, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, వి.జగదీష్, బి.శంకర్ గౌడ్, కె.అశోక్, డి.సత్యనారాయణ, ఉమేష్, వెంకట్ యాదవ్, కె.రామకృష్ణ, సిఎచ్. మురళికృష్ణ, పి.వెంకటేష్ గౌడ్, స్కైలాబ్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.
గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…