గొల్లవానిగుంట రోడ్ త్వరలో అందుబాటులోకి – కమిషనర్ అనుపమ అంజలి

Spread the love


Gollavanigunta Road will be available soon – Commissioner Anupama Anjali

గొల్లవానిగుంట రోడ్ త్వరలో అందుబాటులోకి – కమిషనర్ అనుపమ అంజలి


సాక్షిత : తిరుపతి గొల్లవానిగుంట మాస్టర్ ప్లాన్ రోడ్డు త్వరలో ప్రజలకి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న గొల్లవానిగుంట మాస్టర్ ప్లాన్ రోడ్ పరిస్థితులపై కమిషనర్ అనుపమ అంజలి స్థానిక కార్పొరేటర్ ఉమాఅజయ్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ అనుపమ మాట్లాడుతూ గొల్లవానిగుంట మాస్టర్ ప్లాన్ రోడ్డు అరవై అడుగులతో ఒకటిన్నార కిలో మిటర్ల దూరంతో పధ్మావతిపురం వరకు విస్తరించరించడంతో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వుంటుందన్నారు. గొల్లవానిగుంట మాస్టర్ ప్లాన్ రోడ్ నిర్మించే ప్రకియలో స్థలాలు ఇచ్చిన వారందరికి టిడిఆర్ బాండ్లను ఇవ్వడం జరిగిందని, ప్రదానంగా ఆరు మంది తమ స్థలాలకు ప్రత్యామ్నాయంగ ఇళ్ళ స్థలాలకు డిమాండ్ చేస్తుండగా,

అన్ని విధాలా పరిశీలించి వారికి అదే డివిజన్లో సిపిఆర్ వెనకాల స్థలాలను ఇవ్వడంతో దాదాపు గొల్లవానిగుంట రోడ్ పనులకు ఆటంకాలు తప్పినాయాన్నారు. అదేవిదంగా మరో నలుగురు లీగల్ గా వెల్లడంతో కొంత జాప్యం జరిగినా కూడా కోర్ట్ ఉత్తర్వులు ప్రకారం ఆ సమస్యలను కూడా అధిగమించి రోడ్డును పూర్తి చేయడం‌ జరుగుతుందన్నారు. లీగల్ సమస్యలు వున్నచోట ఆయా స్థలాలను మార్క్ చేసి మిగిలిన స్థలాల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ వెంకటరామి రెడ్డి, డిఈ విజయకుమార్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రహ్మణ్యం, షణ్ముగం, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page