ఆయాలకు మరియు స్వీపర్లకు సరైన గుర్తింపు ఇవ్వండి

Spread the love

బాపట్ల జిల్లా

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు మరియు స్వీపర్లకు సరైన గుర్తింపు ఇవ్వండి అని కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన ఏఐటియుసి

బాపట్ల జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆయాలు మరియు స్వీపర్లు సమస్యల పరిష్కారానికి బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ కు ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగినది. దీనిలోని ప్రధాన అంశాలు స్వచ్ఛభారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాల ఆవరణములలో ఉన్న మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచడానికి ఆయాలను నియమించారు వీరికి ప్రభుత్వం ప్రస్తుతం 6000 వేతనం ఇస్తున్నది వీరు చేసే పని పారిశుద్ధ్య కార్మికుల చేసే పని కంటే ఎక్కువగా పని చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరిని పారిశుద్ధ్య కార్మికులుగా గుర్తించి పారిశుద్ధ్య కార్మికులకు వర్తింపచేసే జీవోను విడుదల చేసి వీరికి 21000 వేతనం చెల్లించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఔట్సోర్సింగ్ నందు చేసిన వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం యూనిఫారం,పిఎఫ్,ఈఎస్ఐ, వంటి సౌకర్యాలు కల్పించాలని ఏఐటియుసి కోరడం జరిగింది అదేిధంగా కోవిడ్ సమయం లో పెండింగ్ లో ఉన్న పాత వేతనాలు వెంటనే చెల్లించాలి వంద మంది కంటే పైన ఉన్న విద్యార్థులు స్కూల్ కు అదనంగా వారికి ఒక ఆయాను ఏర్పాటు చేయాలి 300 మంది విద్యార్థులు దాటిన తర్వాత ప్రతి వంద మందికి ఒక ఆయాను తప్పనిసరిగా నియమించాలి ఆయాలు కాకుండా పారిశుద్ధ కార్మికులు చేసే పని వీరు చేస్తున్నందున పారిశుద్ధ్య కార్మికులుగా గుర్తించి ఇరవై ఒక్క వేలు వేతనం మంజూరు చేయాలి ఆయాలపై విద్యా కమిటీ ప్రమేయం ఉండకుండా రాజకీయ వేధింపులు లేకుండా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి ఆయాలకు స్వీపర్లకు ప్రత్యేకంగా రిటైర్మెంట్ అలవెన్సును కేంద్ర బడ్జెట్ కేటాయించి నెల నెల వేతనాలు సక్రమంగా వచ్చేలా ఆమోదం చేయాలి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి స్కూల్స్ మెర్జింగ్ ప్రక్రియలో తొలగించబడిన ఆయాలను మరొకచోట ఉద్యోగ భద్రత కల్పించాలి అని కోరడం అయినది. మా సమస్యలను వెంటనే పరిష్కరించలని కొరినారు. అన్ని గ్రామాలు, పట్టణాల లో స్కూల్స్ లో పనిచేస్తున్న ఆయాలు స్వీపర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్ , జిల్లా కన్వీనర్ సుజాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్స్ ఆయా మరియు స్వీపర్లు యూనియన్ బాపట్ల జిల్లా సమితి, సభ్యులు పాల్గొనడం జరిగినది.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page