SAKSHITHA NEWS

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వండి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్


సాక్షిత శంకర్‌పల్లి : పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వండని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి సింగపురం 1వ, 9వ, 10వ వార్డులలో జ్యోతి బీమ్ భరత్ స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ కు ఓటు వేయమని కోరారు. అనంతరం మండల, మున్సిపల్ పరిధిలోని చర్చి పెద్దలతో జ్యోతి బీమ్ భరత్ ప్రత్యేకంగా సమావేశమయ్యి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. 13వ తేదీన జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి పార్లమెంటుకు పంపాలని పేర్కొన్నారు. క్రిస్టియన్లకు ఏ సమస్య వచ్చినా కాంగ్రెస్ పార్టీ తరఫున పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని జ్యోతి అన్నారు.

మూడు నెలల క్రితం బిఆర్ఎస్ పార్టీ నాయకులను మీరందరు ఓడించి ఇంట్లో కూర్చోపెట్టిన, రాష్ట్రంలో అధికారం లేకపోయిన కేంద్రంలో బిజేపి పార్టీతో కుమ్మకై మళ్లీ గ్రామాలలోకి ఓట్లు అడగటానికి వస్తున్నారని, వారి దగ్గర అధికారమే లేనప్పుడు ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తుందని మీరందరూ ఆలోచించాలని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎజాస్, ఐఎన్ టియుసి జనరల్ సెక్రెటరీ షేరి అనంతరెడ్డి, కౌన్సిలర్లు శ్రీనాథ్ గౌడ్, చంద్రమౌళి, సంతోష్, అశోక్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ పెంటయ్య, నాయకులు నసిరుద్దీన్, ప్రవీణ్ కుమార్, గోపాల్ రెడ్డి, బద్ధం కృష్ణారెడ్డి, బి బ్లాక్ మహిళ అధ్యక్షురాలు రమ్యశ్రీ, చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ సమీ ఖురేషి, మాదిరెడ్డి సమ్మిరెడ్డి, ముప్పిడి వెంకట్ రెడ్డి, నారాల విజయ్ పాల్ రెడ్డి, నాగమణి, ప్రత్యూష, అమృత, పుష్పమ్మ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

WhatsApp Image 2024 05 08 at 4.13.27 PM

SAKSHITHA NEWS