ఆడపిల్లలు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి: సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సౌత్ చైర్ పర్సన్ డా. శాలిని జాదవ్
హైదరాబాద్: ఆగస్టు 03: ఆడపిల్లలు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సౌత్ చైర్ పర్సన్ శాలిని జాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్ బాలానగర్ చింతల్ లోని భాగ్యరధి జూనియర్ కళాశాల నందు సామాజిక సేవకురాలు డా. శాలిని విద్యార్థులతో సామాజిక అవగాహన పరిశుభ్రత ఇంకా క్యాన్సర్ లాంటి వాటిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. శాలిని మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో మాట్లాడటం కానీ, రాత్రి వేళలో ప్రయాణించవలసి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి , సామాజిక మాధ్యమాలలో అపరిచిత వ్యక్తులతో సంభాషించడం కానీ, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ విధంగా స్పందించాలని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు వివరించారు. ఆడపిల్లలకు చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. కుటుంబం పట్ల సమాజం పట్ల ఏ విధంగా బాధ్యతగా మెలగాలో, విద్యా ఉద్యోగ రంగాలలో ఏ విధంగా రాణించాలో, యుక్త వయస్సులో హార్మోన్ల ప్రభావం మానసిక పరిస్థితి ఇతర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్రియాశీల సభ్యుడు మోహనరావు మిర్తిపాటి, కాలేజీ యాజమాన్యం, మేనేజింగ్ డైరెక్టర్ జై శంకర్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
Sakshitha News
Download App